Telugu Kartelu 2024

Nagababy

Updated on:

telugu kartelu 2024

2024 సంవత్సరం లో నెలల వారీగా వచ్చే తెలుగు కార్తె(Telugu Kartelu 2024)లను, ప్రస్తుత కార్తె గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

పూర్వం రైతులు ప్రకృతిలో జరిగే మార్పులను ఆధారంగా చేసుకుని పంటలు సాగుచేసేవారు. మన తెలుగు రైతులు తమ అనుభవాలను బట్టి వ్యవసాయ పంచాంగాలను తయారు చేసారు. రైతులు నక్షత్రాలను కార్తె అని పిలిచేవారు. ఈ విధంగా సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం అంటే ఆ కార్తె తో పేరు పెట్టారు. ఒక సంవత్సరానికి ఇరవై ఏడు నక్షత్రాలకు 27 కార్తెలు వచ్చాయి. ఐతే అశ్వని తో మొదలు పెట్టి రేవతి వరకు మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో సూర్యుడి ప్రవేశ ఆధారంగా కార్తెలను నిర్ణయించడం జరుగుతూ వస్తుంది. ఉదాహరణకు సూర్యుడు పుష్యమి నక్షత్రంలో ప్రవేశించినప్పటి నుండి పుష్యమి కార్తె మొదలు అవుతుంది. రైతులు తమ అనుభవాల ద్వారా సంపాదించినా విజ్ఞానాన్ని తెలుగు కార్తెలుగా తరువాతి తరాలకు సులువుగా అర్ధం అయ్యేలా పెట్టారు. ఆయా కార్తెలను బట్టి పంటలకు ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలిసేలా తెలుగు కార్తెల రూపంలో తెలియచేసారు.

రెండు వారాల వ్యవధిలో ఉండే కార్తే కాలం ఋతువుల మధ్య మార్పుతో ముడిపడి ఉంటుంది. వాతావరణ మార్పులు, ముఖ్యంగా వర్షపాతం మరియు వ్యవసాయ కార్యకలాపాలపై వర్ష ప్రభావాన్ని అంచనా వేయడంలో కార్తె కీలక పాత్ర పోషిస్తుంది.

కార్తే 2024 యొక్క వర్షాధార నక్షత్రాలు వ్యవసాయ కార్యకలాపాలు సకాలంలో పూర్తి చేసుకుని పంటలు బాగా పండడాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పంటల ఎదుగుదలకు మరియు అభివృద్ధికి తగిన మరియు సకాలంలో వర్షాలు అవసరం. కార్తే కాలంలో ఈ నక్షత్రాల ఉనికి అనుకూల వాతావరణ పరిస్థితులను నిర్ధారిస్తుంది, మంచి పంట పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు కరువు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వర్షాలు కురిసే నక్షత్రాల పరిజ్ఞానంతో రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు . విత్తడం, నీటిపారుదల మరియు పంటకోత ఈ నక్షత్రాలకు సంబంధించి అంచనా వేయబడిన వర్షపాత నమూనాలకు అనుగుణంగా సమయానుకూలంగా నిర్ణయించబడ్డాయి. ఇది రైతులు తమ దిగుబడిని పెంచుకోవడానికి చేయడానికి మరియు భూమి యొక్క సారవంతతను కాపాడుకోవడానికి వీలు కల్పిస్తుంది.

నేలను బట్టి కూడా పంటలను వేయాలి అప్పుడే రైతులకు అధిక లాభాలు వస్తాయి. ఏ కార్తెలో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే రైతులకు అధిక దిగుబడులు వస్తాయో తెలిస్తే నిజంగా రైతే రాజు అవుతారు. అందుచేత ఏ కార్తె ఏ తేదీ మొదలు అవుతుందో తెలుసుకోవడం చాల ముఖ్యం.

కార్తె పేరుతేదీసమయం
ఉత్తరాషాడ కార్తె 11/01/20242:13 AM
శ్రవణ కార్తె 24/01/20243:22 AM
ధనిష్ట కార్తె 06/02/20245:35 AM
శతభిషం కార్తె 20/02/20249:21 AM
పుర్వాబాధ్ర కార్తె 04/03/20243:10 PM
ఉత్తరాబాధ్ర కార్తె 17/03/202410:30 PM
రేవతి కార్తె 31/03/202412:07 PM
అశ్వని కార్తె 11/04/202411:09 PM
భరణి కార్తె 27/04/20243:28 PM
కృత్తిక కార్తె 11/05/202410:23 AM
రోహిణి కార్తె 25/05/20247:53 AM
మృగశిర కార్తె 08/06/20247:22 AM
ఆరుద్ర కార్తె 22/06/20248:24 AM
పునర్వసు కార్తె 06/07/202410:08 AM
పుష్యమి కార్తె 20/07/202411:38 AM
ఆశ్లేష కార్తె 03/08/202412:03 PM
మఖ కార్తె 17/08/202410:42 AM
పుబ్బ కార్తె 31/08/20247:07 AM
ఉత్తర కార్తె 13/09/20241:08 AM
హస్త కార్తె 27/09/20244:04 PM
చిత్త కార్తె 10/10/20244:23 AM
స్వాతి కార్తె 24/10/20241:56 AM
విశాఖ కార్తె 06/11/20249:00 PM
అనూరాధ కార్తె 19/11/20241:56 AM
జ్యేష్ట కార్తె 02/12/20245:03 AM
మూల కార్తె 16/12/2024 7:53 AM
పూర్వాషాడ కార్తె 29/12/20240:03 AM

Discover the auspicious Telugu Kartelu 2024, also known as “Karte” or “Karthi” in Telugu, marking the entry of the Sun into various Nakshatras. These significant celestial events are observed throughout the year, with each Karthi lasting for 13.5 days.

Here are the dates and timings (in Indian Standard Time – IST) for the Telugu Kartelu 2024:

Karte NameDateTime
UttaraShada Karthe 11/01/20242:13 AM
Shravana Karthe 24/01/20243:22 AM
Dhanista Karthe 06/02/20245:35 AM
Shatabisha Karthe 20/02/20249:21 AM
Purva Bhadra Karthe 04/03/20243:10 PM
UttaraBhadra Karthe 17/03/202410:30 PM
Revati Karthe 31/03/202412:07 PM
Aswini Karthe 11/04/202411:09 PM
Bharani Karthe 27/04/20243:28 PM
Krittika Karthe 11/05/202410:23 AM
Rohini Karthe 25/05/20247:53 AM
Mrigashira Karthe 08/06/20247:22 AM
Arudra Karthe 22/06/20248:24 AM
Punarvasu Karthe 06/07/202410:08 AM
Pushyami Karthe 20/07/202411:38 AM
Aslesha Karthe 03/08/202412:03 PM
Makha Karthe 17/08/202410:42 AM
Pubba Karthe 31/08/20247:07 AM
Uttara Karthe 13/09/20241:08 AM
Hasta Karthe 27/09/20244:04 PM
Chitta Karthe10/10/20244:23 AM
Swati Karthe24/10/20241:56 AM
Visakha Karthe06/11/20249:00 PM
Anuradha Karthe19/11/20241:56 AM
Jyeshta Karthe02/12/20245:03 AM
Mula Karthe 16/12/20247:53 AM
PurvaShada Karthe29/12/20240:03 AM

If you find this information helpful, don’t forget to share it with others, and let’s together embrace the divine grace of Telugu Kartelu 2024.

Thank you for reading Telugu Kartelu 2024. If you have any queries, please contact us.

4 thoughts on “Telugu Kartelu 2024”

  1. తెలుగు కర్తెల గురించి కొంత వివరణ ఇచ్చారు.బాగుంది.తేది సమయం ఇచ్చారు.వారం వాహనం కర్తిలో గాలి వాన ఎండ ల వివరాలు కూడా ఇవ్వండి 🙏

    Reply
    • మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు ధన్యవాదాలు. మీరు అడిగిన సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 🙏

      Reply
      • ఏ కార్తెలో ఏ ప్రయోజనం/ప్రభావం జరుగుతుంది తెలుపగలరు.🙏

        Reply

Leave a Comment