top 5 best 5G phones under 15000 in India |
ఒక సంవత్సరం లేక రెండు సంవత్సరాల లోపు ఈ పాత నెట్వర్క్ లు ఆగిపోతాయి. అప్పుడు మనం ఖచ్చితంగా 5G ఫోన్ ఆవశ్యకత ఏర్పడు తుంది. అప్పుడు మనం చచ్చినట్లు కొత్త ఫోన్ తీసుకోవాలి. అదేదో ఇప్పుడే తీసుకుంటే సరిపోతుందిగా అని నా ఉద్దేశ్యం. మనం ఇప్పుడు 8వేలు,10 వేలు లేక పదిహేను వేలు పెట్టి కొన్న సరే, ఎంత అయినా అవి మన డబ్బులే కదా. తర్వాత తీసుకుందాంలే ఇప్పుడు ఏదో తక్కువలో తీసుకుందాం అని అనుకోకూడదు. ఇప్పుడు పెట్టె 8 వేలు లేక తొమ్మిది వేలు కూడా ఒక పెట్టుబడే కదా ఇది మాత్రం ఎందుకు వృధా చెయ్యాలి.
best 5G phones under 15000 ఈ రోజుల్లో మనం రెండు రకాలుగా గుడ్డిగా మోసపోతున్నాము అందులో మొదటిది ఏమిటంటే ఆన్లైన్ లో మనం కొనేటప్పుడు అక్కడ రివ్యూస్ చదువుతాం ఫలానా దానికి రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా 4స్టార్ రేటింగ్ ఉంది అని చెప్పి గుడ్డిగా నమ్మేసి వాటిని కొనేస్తున్నాము, మనం ఆ రివ్యూస్ బట్టి ఇంకేమి ఆలోచించకుండా కొనేస్తాము తర్వాత తిప్పలు పడతాము. మనం ఎందుకని అలా తిప్పలు పడతాము అంటే ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లలో ఉండే ఫేక్ రివ్యూస్ వల్ల ఇలా జరుగుతుంది. చాలా మంది డబ్బులు తీసుకుని పని గట్టుకుని ఈ ప్రోడక్ట్ సూపర్ బంపర్ అని, వాళ్ళు కనీసం వారంరోజులు వాడకపోయినా సరే మేము ఎప్పటినుండో వాడుతున్నాము అని చెప్పి ఫేక్ రివ్యూస్ రాస్తారు. కొన్ని కంపెనీలు కావాలని వాళ్ళ ప్రోడక్ట్ సేల్ కావాలని paid రివ్యూస్ రాయిస్తాయి. వీటిని చూసి నమ్మి కొన్నవాళ్ళు మోసపోతున్నారు. ఓపెన్ గా చెప్పాలంటే నేను కూడా అవి చూసి నమ్మి మోసపోయాను.
ఇంకా రెండోరకం బయట షాప్స్ లో కనుక మొబైల్ కొంటె వాళ్లకు ఎక్కువ కమిషన్ దేంట్లో వస్తుందో దాన్నే కొనమని , అదే బాగా పనిచేస్తుందని చెప్పుతారు. మనం ఏదైనా ఫోన్ గురించి ప్రత్యేకంగా అడిగితే మాత్రం అది సరిగ్గా పని చేయదని, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి మనల్ని భయపెట్టి వాళ్ళు ఏదైతే మన చేత కొనిపించాలని అనుకుంటారో అదే కొనిపిస్తారు ఎందుకంటే వాళ్ళకి దానిలో మార్జిన్ బాగా వస్తుంది.
మరో రకంగా మనం బాగా మోసపోయే దేమిటంటే యూట్యూబ్ ద్వారా, ఈ యూట్యూబర్స్ ఈ ఫోన్ తోపు తురుము అని చెప్తారు మనం వాళ్ళు చెప్పినవి గుడ్డిగా నమ్మేస్తాము, మనము కొనడమే కాకుండా మనకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి కొనిపిస్తాము. ఫలానా అన్నయ్య చెప్పాడు ఫలానా అక్క చెప్పింది లేదా ఫలానా సార్ చెప్పరు ఫలానా మేడం చెప్పారు అని చెప్పి మనం గుడ్డిగా నమ్మకూడదు. కొన్ని కంపెనీలు యూట్యూబ్ లో subscribers, ఇంస్టాగ్రామ్ లో ఫాలోయర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళకి డబ్బులిచ్చి కావాలని ప్రోడక్ట్ గురించి గొప్పగా రివ్యూ రాయమని చెప్తారు. కొంతమంది సెలబ్రిటీస్ కావాలని వాళ్ళు వాడేది అదే అని చెప్పి మరి మనం కొనేలా చేస్తారు.
ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు నేను చెప్పినవి కూడా అలాగే అని మీరు అనుకోవచ్చు కానీ అలా కాదు నేను మీలో ఒకరిని, నేను కొందామనుకున్నపుడు ఏ సమస్యలు ఎదురుకున్నానో అవి మీకు రాకూడని, మీకు ఈజీగా మంచి నాణ్యత కలిగిన ఎక్కువ కాలం ఎటువంటి సమస్యలు రాకుండా ఉండే వాటిని ఈ క్రింద ఇస్తున్నాను. మళ్ళీ చెప్పుతున్నాను నేను ఏ కంపెనీ తోను ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇక్కడ నేను ఎటువంటి Affiliate లింక్స్ ఇవ్వలేదు. మీరు ఇక్కడ గమనించగలరు.
List of best 5G phones under 15000
Samsung Galaxy M13 5G
Samsung Galaxy M13 5G ఫోన్ లో 50 MP ప్రైమరీ కెమెరా 2MP డ్యూయల్ రియర్ కెమెరా డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఈ Samsung Galaxy M13 5G ఫోన్లో సెల్ఫీలు, వీడియో కాల్ లో మాట్లాడానికి 5MP కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB RAM తో 64GB స్టోరేజ్ ఉంటుంది. ఈ Samsung Galaxy M13 5G ఫోన్లో ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెంసిటీ 700 చిప్ సెట్ తో వచ్చింది. 6.5 అంగుళాల IPS LCD డిస్ ప్లే తో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ తో తగినంత 5000mAh బ్యాటరీ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.
Motorola G62 5G
Motorola G62 5G 6.55 అంగుళాల IPS LCD డిస్ ప్లే తో ఉంది . స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ 6GB RAM తో 128GB స్టోరేజ్ ఉంటుంది. Motorola G62 5G ఫోన్ లో 50 MP ట్రిపుల్ రియర్ కెమెరా 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ తో తగినంత 5000mAh బ్యాటరీ కలిగి ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్లో ఉన్నాయి.
iQOO Z6 5G
ఐక్యూ z6 5జి లో 120 Hz రిఫ్రెష్ రేటుతో, 6.58 అంగుళాల IPS LCD డిస్ ప్లే తో ఉంది . స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ 4GB RAM తో 64GB స్టోరేజ్ ఉంటుంది. 50MP +2MP +2MP ట్రిపుల్ రియర్ కెమెరా, LED ఫ్లాష్ , 16MP ఫ్రంట్ కెమెరా తో ఉండడం వాళ్ళ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మంచి షాట్స్ తీసి పెట్టొచ్చు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ తో తగినంత 5000mAh బ్యాటరీ కలిగి ఉంది ,యూఎస్బి టైప్ -C పోర్ట్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 OS అప్డేట్ కూడా ఈ ఫోన్ చేసుకోవచ్చు.
Redmi 11 Prime 5G
రెడ్మీ 11 ప్రైమ్ 5G స్మార్ట్ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేటుతో, 6.58 అంగుళాల IPS LCD డిస్ ప్లే తో ఉంది . మీడియా టెక్ 700 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ 4GB RAM తో 64GB స్టోరేజ్ ఉంటుంది. 50MP డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా తో ఉండడం వాళ్ళ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ తో తగినంత 5000mAh బ్యాటరీ కలిగి ఉంది ,యూఎస్బి టైప్ -C పోర్ట్ , సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.
POCO M4 Pro 5G
పోకో M4 ప్రో 5G బేస్ వేరియంట్ 4GB RAM, 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్ తో 6.6 అంగుళాల FHD +LCD డిస్ప్లే తో ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP ప్రైమరీ లెన్స్ + 8MP అల్ట్రా వైడ్ తో ఉన్నా డ్యూయల్ రియర్ కెమెరా, 16 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ తో తగినంత 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 12. 5 తో పని చేస్తుంది.
ఆన్లైన్ లో ఆఫర్స్ పెట్టినపుడు ఇప్పుడు ఉన్న ధర కన్నా తక్కువకే కొనచ్చు. మీ దగ్గర లేక మీ కుటుంబ సభ్యుల దగ్గర లేక మీ స్నేహితుల దగ్గర గాని ఉన్న వివిధ బ్యాంకు కార్డుల మీద ఆఫర్స్ పెట్టినపుడు ఇంకా 10% తక్కువకే కొనచ్చు. మరొక్క విషయం ఏమిటంటే ఆన్లైన్ లో ఫోన్ కొన్నపుడు ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోవాలి. నాకు ఒకసారి ఫ్లిప్కార్ట్ లో మొబైల్ ఆర్డర్ చేసినపుడు చెక్క ముక్క వచ్చింది దాన్ని చూసి ఒక్కసారి షాక్ తిన్నాను వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే సరైన సమాధానం దొరకలేదు. తర్వాత ఎంతో ఒక పది రోజులు కస్టమర్ కేర్ కీ కాల్స్ చేస్తూ పోరాటం చేస్తే చివరకి మనీ రిఫండ్ వచ్చింది.
ఒకవేళా మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ కనిపించక పోతే ఫోన్ నీ అన్ బాక్స్ చేస్తున్నపుడు మొత్తం వీడియో తీయండి అది మీకు సహాయపడుతుంది. ఫోన్ వచ్చాక దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉందొ చూడాలి ఒకవేళ స్లో గా ఉన్న లేక వైఫై పని చేయకపోయినా, సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వక పోయిన వెంటనే రిటర్న్ చేసేయాలి. తక్కువకి వస్తున్నాయని చెప్పి కొన్ని చినా ఫోన్ లను కొనకపోవడం మనకి చాలా మంచిది. పైన చెప్పిన కంపెనీలలో కూడా నేను చెప్పిన మోడల్స్ మాత్రమే కన్సిడర్ చెయ్యండి. అవే కంపెనీ వేరే మోడల్స్ కొనొద్దు.
Thank you for reading. If you have any queries, please contact us.